శంషాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ బలగాలు, ఆక్టోపస్ పోలీసులు, రక్షక్ బలగాలు, జీఎంఆర్ సిబ్బంది పాల్గొన్నారు. యోగ వలన అనేక రోగాలు నయమవుతాయని... అంతేకాకుండా చురుగ్గా ఉంటారని యోగా గురువు తెలిపారు. పురాతన కాలం నుంచి మన పెద్దలు ఆసనాలు వేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎక్కువ కాలం జీవించేవారని తెలిపారు.
ఆసనాలు వేసిన రక్షక దళాలు - yoga day
అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, పోలీసులు, ప్రజానికం పాల్గొని ఆసనాలు వేస్తున్నారు.
ఘనంగా యోగా దినోత్సవాలు