రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆరుద్ర నక్షత్రోత్సవమున మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, సదస్యం నిర్వహించారు.
వేములవాడ రాజన్నకు ముస్లిం సోదరి కోడె మొక్కులు - రాజన్న సిరిసిల్ల వార్తలు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగింది. ఆరుద్ర నక్షత్రోత్సవమున స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకున్న ముస్లిం మహిళ
ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. మంథనికి చెందిన ముస్లిం భక్తురాలు అప్సర్ శాసిత రాజన్నను దర్శించుకుని... స్వామివారికి కోడె మొక్కు చెల్లించుకున్నారు.
ఇదీ చూడండి:ఫిల్మ్‌సిటీలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన రామోజీరావు