రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల మధ్యమానేరు జలాశయంలో రొయ్య పిల్లలు, చేపపిల్లలను జడ్పీ ఛైర్మన్ సిద్ధం వేణు వదిలారు. ప్రభుత్వం మత్స్యకార రంగం అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. రొయ్య, చేప పిల్లలు పెద్దవయ్యాక మత్స్యకారులు వాటిని విక్రయించుకుని లాభాలు అర్జించాలని... ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి ఖదీర్ పాల్గొన్నారు.
'మత్స్యరంగాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటోంది'
మత్స్యరంగం అభివృద్ధికి ప్రభుత్వం ఆర్థికంగా చేయూత అందిస్తోందని... దానిని అందరూ ఉపయోగించుకోవాలని రాజన్న సిరిసిల్ల జడ్పీ ఛైర్మన్సిద్ధం వేణు సూచించారు.
మత్స్యరంగాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటోంది