తెలంగాణ

telangana

ETV Bharat / state

పాటందుకున్న ఎమ్మెల్యే.. కోరస్​ పాడిన కార్యకర్తలు - సుంకె రవిశంకర్ తాజా వార్తలు

"నీయారు గుర్రాలు... నాయారు గుర్రాలు... పన్నెండు గుర్రాల బండి పోతంది" అంటూ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​... పాట అందుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల వ్యవసాయ మార్కెట్​ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో అందరినీ ఉత్సాహపరిచారు.

mla sunke ravishanker sing a song
పాట అందుకున్న ఎమ్మెల్యే... కోరస్​ పాడిన కార్యకర్తలు...

By

Published : Jan 7, 2020, 1:17 PM IST

వ్యవసాయ మార్కెట్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకరోత్సవం ఘనంగా జరిగింది. కమిటీ ఛైర్మన్​గా కవ్వంపల్లి లక్ష్మీ... ప్రమాణ స్వీకారం చేశారు. రైతులకు సకాలంలో సేవలు అందించాలని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు ఆకాంక్షించారు. జానపద గేయాన్ని ఆలపించి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అందరినీ ఉత్సాహపరిచారు. కార్యక్రమానికి మండల ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు.

పాట అందుకున్న ఎమ్మెల్యే... కోరస్​ పాడిన కార్యకర్తలు...

ABOUT THE AUTHOR

...view details