రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం సమీపంలోని ఇటుక బట్టిల్లో పనిచేసే ఒడిశా కార్మికులు తమ సొంత ప్రాంతాలకు కాలినడకన బయలు దేరారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్నామని వాపోయారు.
యజమాని డబ్బులు ఇవ్వక.. స్వరాష్ట్రానికి నడక.. - corona effect
ఉందామంటే పనులు లేవు... పోదామంటే డబ్బులు లేవు... యజమానిని అడిగితే లాభం లేకపోవటం వల్ల కాలినడకన పయనమయ్యారు ఒడిశాకు చెందిన వలస కార్మికులు. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారంలో ఇటుక బట్టిల్లో పని చేసే కార్మికులు పిల్లాపాపలతో ముందుకు సాగారు.
యజమాని డబ్బులు ఇవ్వక.. స్వరాష్ట్రానికి నడక..
యజమాని డబ్బులు కూడాఇవ్వకపోవటం వల్ల కాలి నడకన స్వరాష్ట్రానికి బయలుదేరామని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లాపాపలు, వృద్ధులు సామాగ్రితో బయలుదేరిన కార్మికులకు స్థానికంగా పలువురు తమకు తోచిన సాయం చేశారు.