తెలంగాణ

telangana

ETV Bharat / state

మిడ్​మానేరు నిర్వాసితుల పోరుబాట - midmaner

పరిహారం వెంటనే చెల్లించాలంటూ సిరిసిల్ల జిల్లా బోయిన్​పల్లి నుంచి జిల్లా కేంద్రానికి మిడ్​మానేరు భూనిర్వాసితులు పాదయాత్ర చేపట్టారు. ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ గౌడ్​ యాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు.

నిర్వాసితుల పాదయాత్రలో కాంగ్రెస్​ నేతలు

By

Published : Jul 31, 2019, 4:57 PM IST

సిరిసిల్ల జిల్లాలో మిడ్​మానేరు నిర్వాసితులు కదం తొక్కారు. తమకు పరిహారం చెల్లించాలంటూ బోయిన్​పల్లి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు ఐక్య సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ గౌడ్ పాల్గొని మద్దతు ప్రకటించారు. నిర్వాసితులు భారీగా తరలి రావడం వల్ల పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

మిడ్​మానేరు నిర్వాసితుల పాదయాత్ర
ఇదీ చూడండి : దేశవ్యాప్తంగా వైద్యం బంద్​- రోగుల ఇక్కట్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details