రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుమార్ స్వగ్రామంలో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని కొదురుపాకలో వేయి మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ముందస్తుగా నిర్వహించారు. నాలుగు లైన్ల వంతెన సమీపంలో తెరాస నాయకుడు జోగినపల్లి రవీందర్ రావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ట్రీగార్డులు ఏర్పాటు చేశారు.
ఎంపీ సంతోశ్ కుమార్ స్వగ్రామంలో కోటి వృక్షార్చన
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టనున్న కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఎంపీ సంతోశ్ కుమార్ స్వగ్రామంలో ముందస్తుగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో వేయి మొక్కలు నాటి.. ట్రీగార్డులు ఏర్పాటు చేశారు.
ఎంపీ సంతోష్ కుమార్ స్వగ్రామంలో కోటి వృక్షార్చన
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దుతున్న సీఎం కృషికి మద్దతుగా ఈ నెల 17న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
ఇదీ చూడండి: కోర్కెలు తీర్చే గట్టు తిమ్మప్ప ఉత్సవాలు నేటినుంచే..