తెలంగాణ

telangana

ETV Bharat / state

మరో రెండురోజుల్లో ఎగువ మానేరుకు కాళేశ్వరం జలాలు

ఎగువ మానేరుకు మరో రెండు రోజుల్లో కాళేశ్వరం జలాలు అందనున్నాయి. కొండపోచమ్మ కాలువ నుంచి కూడెల్లి వాగులోకి పూర్తి సామర్థ్యంతో నీటిని వదలాలన్న మంత్రి కేటీఆర్​ ఆదేశాల మేరకు.. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు.

By

Published : Mar 28, 2021, 3:16 PM IST

upper manner
ఎగువ మానేరుకు కాళేశ్వరం జలాలు

కొండపోచమ్మ కాలువ నుంచి కూడెల్లి వాగులోకి విడుదల చేసిన నీటిని పూర్తి సామర్థ్యంతో వదలాలని కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ ఈఎన్సీ హరేరాంను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. తద్వారా సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎగువ మానేరుకు గోదావరి జలాలు అందుతాయని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు 800ల క్యూసెక్కుల ప్రవాహాన్ని 1300కు పెంచారు.

నీటి ప్రవాహం పెంపుతో కూడెల్లి వాగులో ప్రవాహ వేగం పుంజుకుంది. ఫలితంగా మరో రెండు రోజుల్లో గోదావరి జలాలు నర్మాల ప్రాజెక్టులోకి చేరనున్నాయి. ఎగువ మానేరుకు నీళ్లు రానుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: భక్తుల కొంగుబంగారం... వెంకటాపురం లక్ష్మీనరసింహుడు..

ABOUT THE AUTHOR

...view details