రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకుంది.గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు పాల్వంచ, కూడెల్లి వాగుల నుంచి వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం జలాశయ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 31 అడుగులుగా ఉంది.
నిండుకుండలా ఎగువ మానేరు జలాశయం...పోటెత్తిన పర్యటకులు
గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో నర్మాల ఎగువ మానేరు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యటకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
నిండుకుండలా ఎగువ మానేరు జలాశయం...పోటెత్తిన పర్యాటకులు
జలసవ్వడులను చూసేందుకు ప్రకృతి ప్రేమికుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది. ఎగువ మానేరు పరిసర ప్రాంతమంతా పర్యటకులతో కళకళలాడుతోంది. జలపాతాలను వీక్షించేందుకు వచ్చిన వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, నీటి పారుదల శాఖ అధికారులు సూచిస్తున్నారు.