తెలంగాణ

telangana

ETV Bharat / state

వేములవాడ రాజేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం తొలి సోమవారం పర్వదినం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు మాస్కులు ధరించి... భౌతిక దూరం పాటిస్తూనే స్వామివారిని దర్శించుకుంటున్నారు.

By

Published : Jul 27, 2020, 9:45 AM IST

full of devotees at vemulavada rajeshwara swamy temple
వేములవాడ రాజేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకొని స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. వేకువ జాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామి వారిని దర్శించుకుంటున్నారు. పరివార దేవతలకు ఆలయ అర్చకులు ప్రత్యేక అర్చనలు చేపట్టారు.

వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు కొవిడ్ నిబంధనలకు లోబడి దర్శనం చేసుకున్నారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసిన తరువాతే భక్తులను లోనికి అనుమతిస్తున్నారు. ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి శీఘ్ర దర్శనం అమలు పరుస్తున్నారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. గంటకు 62 పాజిటివ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details