తెలంగాణ

telangana

ETV Bharat / state

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కౌంటింగ్ ప్రారంభం - వెలువడుతున్న పుర ఫలితాలు

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Counting starts in rajanna sircilla district
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కౌంటింగ్ ప్రారంభం

By

Published : Jan 25, 2020, 8:35 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక సినారె కళామందిర్​లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సిరిసిల్ల పురపాలిక పరిధిలోని 39 వార్డులకు గాను 4 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. మిగతా 35 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు.

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కౌంటింగ్ ప్రారంభం

ఇవీ చూడండి: విజేతలు 'చే' జారకుండా ఏంచేద్దాం..?

ABOUT THE AUTHOR

...view details