ETV Bharat / city

విజేతలు 'చే' జారకుండా ఏంచేద్దాం..? - విజేతలు 'చే' జారకుండా ఏంచేద్దాం..?

పురపోరులో గెలుపొందే అభ్యర్థులు చేజారకుండా ఉండేందుకు కాంగ్రెస్​ పార్టీ ముందస్తు చర్యలు చేపట్టింది. విప్​ జారీ చేయాలని నిర్ణయించింది. జిల్లా బాధ్యులు, ఇతర నేతలకు ఫోన్​ చేసిన పీసీసీ చీఫ్​ ఉత్తమ్​ ఎన్నికల ఫలితాలు, మేయర్​, ఛైర్మన్ల ఎన్నికపై దిశానిర్దేశం చేశారు. అవసరమైతే క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.

CONGRESS
విజేతలు 'చే' జారకుండా ఏంచేద్దాం..?
author img

By

Published : Jan 25, 2020, 5:09 AM IST

విజేతలు 'చే' జారకుండా ఏంచేద్దాం..?

పురపాలక ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థులను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ముందస్తు చర్యలు చేపట్టింది. గెలిచిన అభ్యర్థులు అధికార పార్టీ ప్రలోభాలకు చేజారకుండా విప్‌ జారీ చేయాలని హస్తం పార్టీ నిర్ణయించింది. మున్సిపల్​ పోరులో క్యాడర్‌ గట్టిగా పనిచేసిందని పీసీసీ అభిప్రాయపడుతోంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. పార్టీ జిల్లా అధ్యక్షులకు ఫోన్ చేశారు. విజేతలను కాపాడుకునే విషయమై దిశానిర్దేశం చేశారు. అవసరాన్ని బట్టి క్యాంపు రాజకీయాలు చేసేందుకు హస్తం నేతలు సిద్ధమవుతున్నారు.

కార్యకర్తలు బాగా పనిచేశారు..

మ‌ల్కాజిగిరి లోక్‌సభ ప‌రిధిలో.. బోడుప్పల్‌, పీర్జాదీగూడ‌, భువ‌న‌గిరి, తుర్కయంజాల్, పెద్ద అంబ‌ర్‌పేటతోపాటు సిరిసిల్ల, కొల్లాపూర్, కామారెడ్డి, నిజామాబాద్ వంటి చోట్ల అధికార పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని.. పోలీసుల అండతో రెచ్చిపోయారని పీసీసీ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. చాలా చోట్ల తెరాస కార్యకర్తలు, నాయకుల ప్రలోభాల పర్వాన్ని కాంగ్రెస్​ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అవసరమైతే క్యాంపు రాజకీయాలు..

అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చినా.. గెలుపొందే అభ్యర్థులు చేజారకుండా చూడాలని స్థానిక నాయకత్వానికి స్పష్టం చేశారు. ప్రధానంగా ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, మేయర్‌ ఎన్నికల సందర్భంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా విఫ్​జారీ చేయాల‌ని నిర్ణయించారు. ఫలితాల సరళి బట్టి అవసమున్న చోట క్యాంపులు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది.

ఇవీ చూడండి: బస్తీమే సవాల్​: ఫలితాలపై టెన్షన్ టెన్షన్...కోట్లలో బెట్టింగ్..

TG_HYD_12_25_CONG_TAKEN_PREVENTIVE_STEPS_PKG_3038066 Reporter: M Tirupal Reddy Dry ()పురపాలక ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్ధులను కాపాడుకోడానికి కాంగ్రెస్‌ పార్టీ ముందస్తు చర్యలు చేపట్టింది. అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గి...గెలిచిన అభ్యర్దులు చేజారకుండా విప్‌ జారీ చేయాలని హస్తం పార్టీ నిర్ణయించింది. పురపాలక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ క్యాడర్‌ గట్టిగా పని చేసిందని పీసీసీ అభిప్రాయపడుతోంది. పుర ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ మొదవడంతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులతో ఫోన్ చేసి మాట్లాడి గెలుపొందిన అభ్యర్ధులను కాపాడుకునే విషయంపై దిశనిర్దేశం చేశారు. అవసరాన్ని బట్టి క్యాంపు రాజకీయాలు చేసేందుకు కూడా కాంగ్రెస్‌ పార్టీ సిద్దమవుతోంది. LOOK వాయిస్ ఓవర్‌1: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన హోరా హోరీ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాడ‌ర్ పనితీరుపై ఆ పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గకుండా పార్టీ నాయకులు గట్టి పోటీ ఇచ్చారని అభిప్రాయపడుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇదే స్పూర్తితో ముందుకు వెళ్లాలని పీసీసీ యోచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్‌లో ఉత్తేజాన్ని నింపేందుకు వీలుగా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది. శుక్రవారం రోజున జిల్లాల వారీగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, పార్టీ ఇంఛార్జిలు, ముఖ్యనాయకులతో ఫోన్లో మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఈ ఎన్నికల్లో అధికార పార్టీ వ్యవహరించిన తీరు..కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోన్న ఇబ్బందులపై నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా మ‌ల్కాజిగిరి లోకసభ ప‌రిధిలో బోడుప్పల్‌, పిర్జాదీగూడ‌లు, భువ‌న‌గిరి, తుర్కాయంజాల్, పెద్ద అంబ‌ర్‌పేటలతోపాటు సిరిసిల్ల, కొల్లాపూర్ , కామ‌రెడ్డి, నిజ‌మాబాద్ వంటి చోట్ల అధికార పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని...పోలీసుల అండతో రెచ్చిపోయారని పీసీసీ దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల తెరాస కార్యకర్తలు, నాయకులు డ‌బ్బు పంచతుండగా...కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకుని నిలువ‌రించేందుకు ప్రయ‌త్నించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికార పార్టీని బలంగా ఎదుర్కొని గట్టి పోటీనిచ్చినా...గెలుపొందే అభ్యర్ధులకు తెరాస బేరం పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పిరాయింపులు జరగకుండా చూడాలని స్థానిక నాయకత్వానికి స్పష్టం చేశారు. అదేవిధంగా గెలుపొందే అభ్యర్ధులను కాపాడుకోడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, మేయర్‌ ఎన్నికల సందర్భంగా పార్టీ పిరాయింపులకు పాల్పడకుండా విఫ్ జారీ చేయాల‌ని నిర్ణయించారు. ఇవాళ వచ్చే ఫలితాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన పురపాలక సంఘాల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలని కూడా కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.