కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలానికి చెందిన సింహాచలం వే బిల్ తీసుకుని సిరిసిల్ల నుంచి టిప్పర్‌లో ఇసుకను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎల్లారెడ్డిపేట సీఐ లింగమూర్తి టిప్పర్‌ను మాచారెడ్డి మండలం లచ్చ పేట వద్ద పట్టుకున్నారు. అనంతరం గంభీరావుపేట ఠాణా ఎస్సై అనిల్‌కు గత నెల 19న అప్పజెప్పారు. మరుసటి రోజు గంభీరావుపేట ఎస్సై అనిల్‌కు... సింహాచలం కలవడం వల్ల డబ్బులు రెడీ చేసుకోండని సదరు ఎస్ఐ చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు.
పోలీసులే లంచం అడిగారు...అరెస్టయ్యారు - అన్నీ ఉన్నా టిప్పర్‌ను ఆపారు... కటకటాల పాలయ్యారు
13:30 January 03
పోలీసులే లంచం అడిగారు...అరెస్టయ్యారు
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ...
మరుసటి రోజు వచ్చిన సింహాచలంను పోలీసు అధికారులు రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సింహాచలం... ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు శుక్రవారం గంభీరావుపేట ఠాణా కానిస్టేబుల్ కనకరాజుకు 10,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ పట్టుకుంది. రాజును పట్టుకుని విచారించగా... ఎస్సై తీసుకోమంటేనే తాను తీసుకున్నానని వెల్లడించాడు.
ఈ మేరకు ఎస్ఐ అనిల్‌ను విచారించగా సీఐ తీసుకోమన్నాడని తెలిపారు. సదరు పోలీస్ అధికారులను విచారించగా... నేరం రుజువైంది. ఎల్లారెడ్డిపేట సీఐ లింగమూర్తి, గంభీరావుపేట ఎస్సై అనిల్, కానిస్టేబుల్ కనకరాజులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య పేర్కొన్నారు.