రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు జలాశయం నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోని నాలుగు గేట్లు ఎత్తి 6,300 క్యూసెక్కుల జలాలను దిగువ మానేరు ప్రాజెక్టులోకి తరలిస్తున్నారు. ప్రస్తుతం మధ్యమానేరులో 13 టీఎంసీల నీరు నిలువ ఉండగా.. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు మొదలు పెట్టడంతో దిగువ ప్రాంతాల్లోని జలాశయాలకు నీటిని తరలిస్తున్నారు.
మధ్యమానేరు జలాశయం నుంచి నీటి విడుదల
మధ్యమానేరు ప్రాజెక్టు నుంచి 6,300 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు మొదలు పెట్టడంతో నీటి లభ్యత ఆధారంగా దిగువ మానేరు జలాశయానికి నీటిని తరలిస్తున్నామని అధికారులు తెలిపారు.
మధ్య మానేరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల
నీటి లభ్యత ఆధారంగా దిగువ మానేరు ప్రాజెక్టుకు నీటిని తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. గోదావరి నది జలాల ఎత్తిపోతలు మొదలు పెట్టడంతో ముందుగా దిగువ ప్రాంతాలకు నీటిని పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ ఎత్తిపోతల జలాల తరలింపుతో నిండుగా ప్రవహిస్తోంది. గోదావరి నది జలాల ఎత్తిపోతలతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది.
ఇదీ చదవండి:పింఛన్లు రాలేదు.. డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు.. ఏం చేశావని ఇక్కడకు వచ్చావ్..