పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కార్యాలయం సమీపంలో బి-గెస్ట్‌హౌజ్ వద్ద రాజీవ్ రహదారిపై కర్రలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. రాకపోకలకు తీవ్ర అంతరయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రామగుండం ట్రాఫిక్ సీఐ రమేష్‌బాబు వెంటనే స్పందించారు.
రోడ్డుపై కర్రల లారీ బోల్తా.. తొలిగించిన పోలీసులు
పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ పోలీసులు సమాచారం అందిన వెంటనే స్పందించారు. రాజీవ్ రహదారిపై ప్రమాదంలో పడిన కర్రలను తొలగించి రాకపోకలు సజావుగా సాగేలా చేశారు.
రోడ్డుపై కర్రల లారీ బోల్తా.. తొలిగించిన పోలీసులు
సుమారు 20 మంది ట్రాఫిక్ సిబ్బందితో రోడ్డుపై అడ్డంగా పడిన కర్రలను తొలగించారు. రాకపోకలు సజావుగా సాగాయి. ట్రాఫిక్ పోలీసులు జరిమానాలే విధించటమే కాదు.. ప్రజలకు సేవా చేయటంలో తమకంటూ ప్రత్యేకత చాటుకున్నారు.