పెద్దపల్లి ఎంపీ నేత వెంకటేశ్ విసిరిన హరిత సవాల్‌ను రామగుండం సీపీ సత్యనారాయణ స్వీకరించారు. పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో మొక్కలు నాటారు.
డీసీపీలకు రామగుండం సీపీ సవాల్ - రామగుండం సీపీ సత్యనారాయణ
మొక్కలు నాటి వాటిని సంరక్షించడం గొప్ప కార్యమని తద్వారా భావితరాలకు మంచి వాతావరణం అందించిన వారవుతారని రామగుండం పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ పేర్కొన్నారు
డీసీపీలకు రామగుండం సీపీ సవాల్
అనంతరం పెద్దపల్లి డీసీపీ రవీందర్, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, కమిషనర్ సంజీవ్‌లకు మొక్కలు నాటి, మరో ముగ్గురికి సవాల్ విసిరాలని గ్రీన్ ఛాలెంజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రామగుండం పరిధిలోని పోలీసు అధికారులు 150 మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. దీనిద్వారా రాబోయే తరాలకు ఆరోగ్యకరమై వాతావరణాన్ని అందిచినవాళ్లమవుతామని సీపీ పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : ఒక్కో ఎన్‌కౌంటర్‌దీ ఒక్కో కథ