పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థలో ఎన్నికైన కొత్త పాలకవర్గం బాధ్యతలు స్వీకరించారు. రామగుండం నగర మేయర్‌గా బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు తమ ఛాంబర్లలో బాధ్యతలు చేపట్టారు. ఎన్నికైన అనంతరం మొదటిసారిగా రామగుండం నగరపాలక కార్యాలయానికి వచ్చిన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు వేదపండితుల మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
బాధ్యతలు స్వీకరించిన రామగుండం మేయర్ - ramagunda mayor took charges
రామగుండం నగర మేయర్‌గా బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్‌గా నడిపల్లి అభిషేక్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కార్పొరేటర్లు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
బాధ్యతలు స్వీకరించిన రామగుండం మేయర్
మేయర్ ఛాంబర్‌లో కూర్చున్న బంగి అనిల్ కుమార్ ప్రత్యేక పూజల అనంతరం మొదటి ఫైల్‌పై సంతకం చేశారు. అనంతరం గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని కార్పొరేషన్ కార్యాలయం ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:నిరసనకారులకు 'కారం'తో సామాన్యుడి జవాబు!