తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్దపల్లి గురుకుల పాఠశాలలో జడ్పీ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీ - manoher

మంథనిలోని గుంజపడుగు గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులకు సరైన వసతులు లేకపోవడం వల్ల పెద్దపల్లిలోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో చేర్పించారు అధికారులు. అప్పటికే అక్కడ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రాగా... పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అక్కడికి చేరుకుని సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

పెద్దపల్లి గురుకుల పాఠశాలలో జెడ్పీ చైర్మన్ ఆకస్మిక తనిఖీ

By

Published : Jul 10, 2019, 11:28 AM IST


మంథని నియోజకవర్గంలోని గుంజపల్లి గురుకుల పాఠశాల నుంచి వచ్చి పెద్దపల్లి మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో చేరిన విద్యార్థులను యథా స్థానానికి తరలిస్తామని పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం పెద్దపల్లిలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పెద్దపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ లతీఫ్‌తో సమావేశం నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంథనిలోని గుంజపడుగు గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులకు సరైన వసతులు లేకపోవడం వల్ల ఇటీవల అధికారులు పెద్దపల్లి గురుకుల పాఠశాలో చేర్పించినట్లు తెలిపారు.

పెద్దపల్లి గురుకుల పాఠశాలలో జెడ్పీ చైర్మన్ ఆకస్మిక తనిఖీ

పెద్దపల్లి గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇబ్బంది కావడం వల్ల వాళ్ల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వచ్చినట్లు తెలిపారు. మంగళవారం గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జడ్పీ చైర్మన్ అధికారులతో మాట్లాడి సమస్య వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులను కలిసి సమస్య పరిష్కారమయ్యేంత వరకు శాంతియుతంగా ఉండాలని కోరారు.
ఇవీ చూడండి: 'అసెంబ్లీ నిర్మాణంపై దాఖలైన వ్యాజ్యాలు కొట్టేయాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details