గోదావరిఖనిలో కృష్ణాష్టమి వేడుకలు - గోదావరిఖనిలో కృష్ణాష్టమి వేడుకలు
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల్లో ముందుస్తు కృష్ణాష్టమి వేడుకల ఘనంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణ, గోపిక వేషధారణలతో అలరించారు.
గోదావరిఖనిలో కృష్ణాష్టమి వేడుకలు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పవర్ హౌస్ కాలనీలోని ఓ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు జరిపారు. చిన్నారులు శ్రీ కృష్ణ, గోపిక వేషధారణలతో చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే చిన్నారులకు పండుగల విశిష్టతను తెలిపే కార్యక్రమాలు చేపడుతున్నామని పాఠశాల నిర్వాహకులు పేర్కొన్నారు.