తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి' - పెద్దపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గడ్డం వివేక్

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా భాజపా పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా ఇవాళ పెద్దపల్లి పురపాలక సంఘంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ ఎంపీ గడ్డం వివేక్ ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

BJP ELECTION CAMPAIGN IN PEDDAPALLI MUNICIPALITY
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

By

Published : Jan 13, 2020, 5:16 PM IST

పెద్దపల్లి పురపాలక సంఘంలో భాజపా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గడ్డం వివేక్ పాల్గొన్నారు. పుర ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీలోని 36 స్థానాల్లో గెలుపొందాలని ఆయన సూచించారు.

కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి చర్యలను కూడా ప్రజలకు వివరించాలని తెలిపారు. పుర ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించాలని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఇదీ చూడండి : 'కేటీఆర్ ఆస్తులు 425 శాతం ఏలా పెరిగాయి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details