తెలంగాణ

telangana

టీయూలో ఈ నెల 19 వరకు ఎంఏ కోర్సులకు వెబ్​ ఆప్షన్లు

By

Published : Oct 16, 2019, 10:41 PM IST

సీపీజీఈటీ-2019 పీజీ ప్రవేశాల ప్రక్రియ ముగిసిన దృష్ట్యా... ఎంఏ విద్యార్థులకు మరో అవకాశం కల్పించింది యాజమాన్యం. ఈ నెల 19 వరకు ఎంఏ పొలిటికల్​ సైన్స్​, హిస్టరీ కోర్సులకు వెబ్​ఆప్షన్లు పెట్టుకునే సౌలభ్యం కలిగించింది.

WEB OPTIONS FOR MA POLITICAL SCIENCE AND HISTORY IN TELANGANA UNIVERSITY

తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్​లో ఎంఏ పొలిటికల్ సైన్స్, హిస్టరీ కోర్సులకు యాజమాన్యం వెబ్​ఆప్షన్స్ అవకాశం కల్పించింది. సీపీజీఈటీ-2019 పీజీ ప్రవేశాల ప్రక్రియ ముగిసిన దృష్ట్యా... తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణం బిక్కునూరులో నూతనంగా ప్రారంభించబడిన ఈ రెండు కోర్సులకు ఈ నెల 19 వరకు వెబ్ఆప్షన్లు పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నట్లు అడ్మిషన్స్ డైరెక్టర్ బాలకిషన్ తెలిపారు. సీపీజీఈటీ-2019లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

టీయూలో ఈ నెల 19 వరకు ఎంఏ కోర్సులకు వెబ్​ ఆప్షన్లు

ABOUT THE AUTHOR

...view details