వివేకానంద 157వ జయంతి పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో సమగ్రత ర్యాలీ నిర్వహించారు. పులంగ్ చౌరస్తా నుంచి ప్రధాన వీధుల గుండా ఎన్టీఆర్ చౌరస్తా వరకు ఈ ప్రదర్శన చేపట్టారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో జాతీయ సమగ్రత ర్యాలీ - ఏబీవీపీ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి సమగ్రత ర్యాలీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఏబీవీపీ సమగ్రత ర్యాలీ నిర్వహించింది. జిల్లా కేంద్రంలోని పలు వీధుల గుండా ప్రదర్శన నిర్వహించారు.
'స్వామి వివేకానంద సాహిత్యం వల్లే ఎంతో మంది గొప్పవారయ్యారు'
విశ్వమత సభల ద్వారా దేశ సంస్కృతిని సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు రేంజర్ల నరేష్ కొనియాడారు. ఎంతో మంది స్వామి వివేకానంద సాహిత్యం వల్లే గొప్పవారయ్యారని ఆయన పేర్కొన్నారు. యువత... పరాయి దేశాల సంస్కృతిని వీడి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి : 'కశ్మీర్‌పై సుప్రీం తీర్పుతో మోదీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ'
TAGGED:
Abvp_Ryali