తెలంగాణ

telangana

By

Published : Apr 5, 2021, 10:54 PM IST

ETV Bharat / state

అక్కడ వైద్యులకు కరోనా ఉన్నా కూడా చికిత్స చేస్తున్నారు..

సాధారణంగా మనకు కరోనా వస్తే.. మనం ప్రైవేటు లేదా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటాం. కానీ ఆ ఆస్పత్రికి వెళ్లిన వారికి ఇప్పుడు కరోనా పాజిటివ్​ వస్తుంది. అవును నిజమే.. ఎందుకో తెలుసా ఆ ఆస్పత్రి వైద్యులతోపాటు సిబ్బందికి సైతం కొవిడ్​ పాజిటివ్​ అని తేలింది. విషయం తెలిసిన డీఎమ్​హెచ్​ఓ తనిఖీలు చేసి గుట్టు రట్టు చేశారు. ఈ ఘటన నిజామాబాద్​ నగరంలో చోటుచేసుకుంది.

nizamabad Nishkal Neuro Hospital, corona positive news
అక్కడ వైద్యులకు కరోనా ఉన్నా కూడా చికిత్స

కొవిడ్‌ ఉన్నప్పటికీ చికిత్స అందిస్తున్న ఆస్పత్రిని అధికారులు సీజ్‌ చేశారు. నిజామాబాద్ నగరంలోని నిష్కల్ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహిస్తున్న యజమాని డాక్టర్ నిష్కల్ ప్రభుకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. అయిప్పటికీ అతను పేషెంట్లకు చికిత్సలు అందిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఆస్పత్రిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం ఆకస్మిక తనిఖీ చేసి.. సిబ్బందికి కొవిడ్ టెస్టులు నిర్వహించారు.

దీంతో ఆస్పత్రిలోని ఉన్న 30 మంది సిబ్బందిలో 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు డీఎమ్​హెచ్​ఓ తెలిపారు. ఆస్పత్రి యజమాని ప్రభుకు కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించించేందుకు సిద్ధమవ్వగా.. ఆయన తప్పించుకుని పారిపోయాడని డీఎమ్​హెచ్​ఓ సుదర్శనం వెల్లడించారు. రెండు గంటలకుపైగా అతని కోసం వేచిచూసినప్పటికీ ఆయన రాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ఆస్పత్రిని మూసివేయించామని వివరించారు.

ఇదీ చూడండి :రాజన్న సిరిసిల్ల జిల్లా జయవరంలో 51 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details