నిజామాబాద్ పుర, నగరపాలిక ఎన్నికల్లో భాజపా పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఎంపీ అర్వింద్ ధన్యవాదాలు తెలియజేశారు. ఎక్స్ అఫీషియో ఓట్లను బట్టి తెరాసకు ఎక్కువ సభ్యులు ఉన్నందున మేయర్ పీఠం కమలం పార్టీకు దక్కదని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు.
'మేయర్ పీఠం దక్కకపోయినా.. నగరాభివృద్ధికి పాటుపడతాం' - నిజామాబాద్ పురపాలిక ఎన్నికల ఫలితాలు
నిజామాబాద్ కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో ఓట్ల వల్ల భాజపాకు మేయర్ పీఠం అందదని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు. కేంద్ర నిధులు దుర్వినియోగం కాకుండా నగరాభివృద్ధికి పాటుపడాలని నేతలను సూచించారు.
'మేయర్ పీఠం దక్కకపోయినా.. నగరాభివృద్ధికి పాటుపడతాం'
కార్పొరేషన్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ నగరాభివృద్ధికి కీలకపాత్ర పోషించాలని నేతలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూసుకోవాలంటూ ఆయన తెలిపారు.
ఇదీ చూడండి : పురపాలికలను దక్కించుకునేందుకు తెరాస వ్యూహాలు