నిజామాబాద్ జిల్లా లింగంపల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎన్ఆర్ఈజీఎస్ జాయింట్ సెక్రటరీ రోహిత్ కుమార్ పరిశీలించారు. కేంద్ర బృందం, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిలతో కలిసి పథకం వల్ల కూలీలు ఏ విధంగా లాభపడుతున్నారో.. వారినే అడిగి తెలుసుకున్నారు.
ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులను పరిశీలించి.. పని కొలతలు, వేతనాల గురించి అధికారులను ఆరా తీశారు రోహిత్. అనంతరం పెద్ద చెరువు వద్దనున్న వర్క్ సైట్ బోర్డ్లను పరిశీలించారు. కంపోస్ట్ షెడ్ బాగుందని మెచ్చుకున్నారు.