తెలంగాణ

telangana

ETV Bharat / state

Prasanth reddy: ఆ విషయంలో ఇబ్బందులకు గురిచేస్తే మిల్లు సీజ్: వేముల - కొనుగోలు కేంద్రాలు

రైతుల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది తెరాస ప్రభుత్వమేనని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తన బాధ్యతను విస్మరించిందన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలకేంద్రంలో యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

Prasanth reddy
వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

By

Published : Apr 14, 2022, 3:19 PM IST

తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష అన్నమాట మరోసారి రుజువైందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేంద్రం తన బాధ్యతను విస్మరించినా రైతుల కోసం సీఎం కేసిఆర్ ధాన్యం సేకరణ చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

రాష్ట్ర రైతులకు ఏడాదికి రూ.12 వేల కోట్లు వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ, రూ.15 వేల కోట్ల రైతు బంధు, పుష్కలంగా సాగునీరు కేసీఆర్ అందిస్తున్నారని మంత్రి వెల్లడించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తేమ లేకుండా ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకొచ్చి క్వింటాలుకు మద్దతు ధర పొందాలని సూచించారు. మంచి ధాన్యంలో తరుగుతీసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే రైస్ మిల్లులు సీజ్ చేస్తామని ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ రైతుల ధాన్యాన్ని కేంద్రంతో కొనిపిస్తామని రెచ్చగొట్టిన బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇప్పుడు పక్కకు తప్పుకున్నారని విమర్శించారు. భాజపా నాయకుల మాటలు రైతులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ ఛైర్మన్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీసీవో సింహాచలం, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఏనాటికైనా, ఎప్పటికైనా తెలంగాణ రైతులకు కేసీఆరే శ్రీరామరక్ష అన్నమాట మరోసారి రుజువైంది. ఎవరు కాదన్నా ఔనన్నా కాదనలేని సత్యం. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం. కాళేశ్వరం ద్వారా రైతుల సాగునీటి కష్టాలు లేకుండా చేశాం. రైతుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ధాన్యం కొనాల్సిన బాధ్యత రాజ్యాంగం ప్రకారం కేంద్రానిదే. కానీ వారు మొండివైఖరి అవలంభిస్తున్నారు. అయినప్పటికీ ఆ నూకలకు అయ్యే నష్టాన్ని భరించేందుకు ముందుకొచ్చాం. రైతులు కూడా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురండి. అందరి రైతులకు మద్దతు ధరకు రావాలని ఆశిస్తున్నా. తరుగు విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే రైస్ మిల్లులు సీజ్ చేస్తాం.

- వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details