కొత్తగా కొలువులో చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నాలుగు నెలలుగా జీతం రాక అవస్థలు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 362 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కొత్తగా ఏప్రిల్ 12న కొలువులో చేరారు. వారు విధుల్లో చేరి నెలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వేతనాలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జీతం పొందలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు.
కొలువులిచ్చారు సరే... మరీ జీతాలు? - junior-panchayathi Secretaries
నాలుగు నెలలు గడుస్తున్న కొత్త జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు జీతాలు అందక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు.
కొలువులిచ్చారు సరే... మరీ జీతాలు?