నిజామాబాద్ జిల్లా కేంద్రం కూడళ్లు కాషాయ మయమ్యాయి. జై హనుమాన్ నినాదాలతో మార్మోగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. కంటేశ్వర్ నుంచి ప్రారంభమైన విజయయాత్ర సాయంత్రానికి గోల్ హనుమాన్ వరకు కొనసాగతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. యువకులు డీజే పాటలకు డాన్సులు చేస్తూ అలరించారు.
ఇందూరులో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర - భజరంగ్ దళ్
నిజామాబాద్లో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణం వీధుల్లో ర్యాలీ తీస్తూ జైహనుమాన్ నినాదాలతో హోరెత్తించారు అంజన్న భక్తులు.
హనుమాన్ శోభాయాత్ర