నిజామాబాద్ పట్టణానికి గ్రామాల నుంచి తీసుకొచ్చి తాటి ముంజలను విక్రయించి ఉపాధి పొందుతున్నారు కొందరు పల్లెవాసులు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సీజన్లో తాటి ముంజలు గిరాకీ ఉంటుందని ఆశతో విక్రయదారులు ఎదురు చూశారు. కానీ లాక్డౌన్ కారణంగా ఈ సీజన్లో 20 రోజుల గిరాకీ పోయిందని విక్రయదారులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఆలస్యం కావడం వల్ల తాటి చెట్లపైన ముంజలు ముదిరిపోయాయి.
ఏం పోషకాలు ఉంటాయంటే...
ఈ కాలంలో తాటిచెట్లకు ముంజలు విరివిగా కాస్తాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సల్ఫర్, కాపర్ తదితర పోషక విలువలు కలిగి ఉంటడంతో పాటు మనిషి శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతాయి. రక్తహీనతను సైతం తగ్గించడానికి ఎంతో ఉపకరిస్తాయని.. తాటి ముంజల్లో అనేక ఖనిజ లవణాలు దాగి ఉన్నాయని అంటున్నారు. ముంజల్లో ఉన్న చిక్కటి గువ్వ రక్తహీనతను సైతం తగ్గించడానికి ఎంతో ఉపకరిస్తాయి. తాటిముంజల్లో అనేక ఖనిజ లవణాలు దాగి ఉన్నాయి. ముంజల్లో ఉన్న చిక్కటి గువ్వ మనిషి శరీరంలో వేడిని తగ్గించడానికి ఎంతగానో దోహదపడుతుంది.చెమట ద్వారా మనం కోల్పోయిన లవణాలను భర్తీ చేసే గుణం తాటి ముంజలకు ఉంటుంది.