తెలంగాణ

telangana

వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం మృతదేహం అందజేత

By

Published : Mar 1, 2021, 9:27 AM IST

వివిధ రోగాలపై పరిశోధన చేస్తున్న వైద్య విద్యార్థుల కోసం తన సోదరి మృతదేహాన్ని అందజేశారు నిజామాబాద్​ నగర సీపీఐ(ఎంఎల్​) నాయకులు. ఈ మేరకు ఆమె భౌతిక కాయాన్ని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించారు.

dead body submitted to govt medical college
ప్రభుత్వ వైద్య కళాశాలకు మృతదేహం అందజేత

సీపీఐ(ఎంఎల్ )న్యూడెమోక్రసీ నిజామాబాద్ నగర నాయకులు పోచమ్మ గల్లీవాసి నీలం సాయిబాబా పెద్ద అక్క నీలం ఇందిర.. అనారోగ్యంతో ఆదివారం ఉదయం మరణించింది. మెడికల్​ కళాశాలల్లో పరిశోధనల కోసం కుటుంబ సభ్యులు, పార్టీ నాయకుల సమక్షంలో ఇందిర భౌతికకాయాన్ని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలకు సాయిబాబా అదేరోజు మధ్యాహ్నం అందజేశారు.

సాయిబాబా.. గతంలో ఆయన తల్లి నీలం లక్ష్మి భౌతికకాయాన్ని కూడా వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం అప్పగించినట్లు న్యూ డెమోక్రసీ డివిజన్​ కార్యదర్శి ఆకుల పాపయ్య తెలిపారు. ప్రభుత్వ విద్య, వైద్యం మెరుగుపడాలని సాయిబాబా తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా కుటుంబ సభ్యులు, జిల్లా నాయకులు వేల్పూరు భూమయ్య, దాసు, పార్టీ నగర కార్యదర్శి పరుచూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కరోనా తొలి కేసుకు రేపటితో ఏడాది

ABOUT THE AUTHOR

...view details