చిన్న చిన్న గొడవలతో నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు గేట్లు మూసేసిన అధికారులు బ్యాలెట్ బాక్సులను భద్రంగా సీజ్ చేశారు. స్ట్రాంగ్ రూంలకు తరలించారు. కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో 413 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 3,07,099 లక్షలు కాగా సాయంత్రం 5 గంటల్లోగా 1,87,705 లక్ష ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కార్పొరేషన్లో పోలింగ్ 61.12 శాతం నమోదయింది.
నిజామాబాద్ కార్పొరేషన్లో ముగిసిన పోలింగ్ - నిజామాబాద్ కార్పొరేషన్లో ముగిసిన పోలింగ్
నిజామాబాద్ కార్పొరేషన్లో చెదురుమదురు గొడవలతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
నిజామాబాద్ కార్పొరేషన్లో ముగిసిన పోలింగ్