నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంతో పాటు.. గన్నారంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను శనివారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. ఇందల్వాయిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం పనులను కలెక్టర్ సమీక్షించారు. పనుల పురోగతి బాగుందని, డబుల్ బెడ్రూం నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి.. లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ సూచించారు.
డబుల్‌బెడ్ రూం ఇళ్లను పరిశీలించిన కలెక్టర్ నారాయణరెడ్డి - ఇందల్వాయి మండలం
నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండల కేంద్రంలో, గన్నారంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. పనులను పర్యవేక్షించిన కలెక్టర్ పురోగతిపై అధికారులను ప్రశంసించారు.
డబుల్‌బెడ్ రూం ఇళ్లను పరిశీలించిన కలెక్టర్ నారాయణరెడ్డి
గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ప్లాంటేషన్ చేసుకొని గ్రామాన్ని అందంగా తీర్చి దిద్దడానికి 50 నుంచి 100 వరకు కొబ్బరి, అశోక చెట్లు నాటాలని సూచించారు. గన్నారంలోని డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కొరకు గుర్తించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీఓ సింహాచలం, ఆర్అండ్ బీ ఎస్ఈ రాజేశ్వర్‌రెడ్డి, ఈఈ రాంబాబు, డీఈ రాజేందర్, ఎంపీడీవో రాములు, తహశీల్దార్ రమేష్, ఎంపీపీ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:తెలంగాణలో ఆకలి చావుల్లేవు: హైకోర్టు