Attack on NSG commando: దేశాన్ని రక్షించే సైనికుని పైనే దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. అక్కడితో ఆగకుండా తన భార్యను కాలితో తన్ని, జుట్టుపీకీ ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును తెంపుకెళ్లారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా, పాకాల గ్రామంలో చోటుచేసుకుంది. అసలేమైందంటే..
మూడ్ రమేష్ అనే ఎన్ఎస్జీ కమాండో తాను కష్టపడి సంపాదించుకున్న దానితో కొంత భూమిని కొని తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. దానిని కొందరు ప్రజాప్రతినిధులు ఆక్రమించి ఈ భూమి మాదంటూ.. తన భార్యపై దాడికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను రమేష్ తన బామర్ది చందు ఫోన్లో వీడియో తీస్తుంటే వాళ్ల ఫోన్లను లాకెళ్లారు. ఏమిటీ దౌర్జన్యం అని ప్రశ్నించిన రమేష్‌ను మరో సారి ఈ భూమిలోకి వస్తే ప్రాణాలు తీస్తాం.. అని బెదిరించి నాలుగురు వ్యక్తులు రమేష్‌ను తరుముతూ అతనిపై గొడ్డలి విసిరి, రాళ్లతో దాడికి పాల్పడ్డారు.
వారి నుంచి ప్రాణాలు రక్షించుకున్న అతను పోలీసులకు ఫోన్ చేయడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారితో పాటు రమేష్ కూడా పొలంలోకి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ వ్యక్తులు రమేష్‌ను, తన బామర్ది చందును, తన భార్యను సైతం విచక్షణారహితంగా కొట్టారు. దానితో రమేష్ తన సమస్యను నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. దానిపై స్పందిన కలెక్టర్ దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుని సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
"నేను ఆరు నెలల క్రితం నా భార్య పేరు మీదిగా 23 గుంటల భూమిని పోతిరెడ్డి అభిషేక్‌రెడ్డి వద్ద కొన్నాను. సర్వే నంబర్ 774-ఈ-1, భూమిని సెప్టెంబర్ 20 తేది నాడు నా భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను. తర్వాత నేను సెలవులకు వచ్చి భూమిని చదునుచేయగా నా మీద అనవసరంగా ఎమ్పీపీ బాదావతి రమేష్, శ్రీ కొండ ఎమ్పీపీ ఎమ్ రాజేందర్, స్టేషన్ తాండా సర్పంచ్ మోహన్, అంబర్‌సింగ్ అనే వ్యక్తి మరో 20 మంది సడెన్‌గా బాదావతి రమేష్ అనే వ్యక్తి నా భార్య జుట్టుపట్టుకొని చెప్పుతో కొట్టాడు. మా రెండు ఫోన్లను లాకెళ్లిపోయారు. నన్ను చంపడానికి నలుగురు వ్యక్తులు నా వెంటపడ్డారు. వాళ్ల నుంచి తప్పించుకుని 100కు ఫోన్ చేయగా పోలీసులు వచ్చారు. వారి ముందు కూడా విచక్షమణా రహితంగా మమల్ని కొట్టారు. రమేష్, మోహన్, నుంచి మాకు ప్రాణ హాని ఉంది.కాబట్టి మాకు రక్షణ కల్పించి మా భూమిని మాకు ఇప్పించమని కలెక్టర్ గారిని కలవడం జరిగింది. దినిపై విచారణ జరిపించి సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ గారు చెప్పారు."-రమేష్, ఎన్ఎస్జీ కమాండో
ఎన్ఎస్జీ కమాండో భూమినే లాక్కొని దౌర్జన్యం చేశారు..!
ఇవీ చదవండి: