సాహసం శ్వాసగా సాగిపోతున్న యువత విద్యార్థుల్లో ధైర్యం, ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు నిజామాబాద్ రోటరీ క్లబ్ సాహస క్రీడల శిక్షణకు శ్రీకారం చుట్టింది.
గత ఐదేళ్లుగా సాహస క్రీడలు
గత ఐదేళ్లుగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్ అటవీ ప్రాంతంలో ఈ క్రీడలను నిర్వహిస్తోంది. మంగళవారం కూడా 225 మందికి తర్ఫీదు ఇచ్చారు. ఈ క్రీడలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పలు పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందాలు శిక్షణ పొందేందుకు ఇక్కడికి వచ్చాయి. పలు అంశాల్లో శిక్షకులు శిక్షణ ఇచ్చారు.
రోజంతా శిక్షణ
పెద్ద పెద్ద బండరాళ్లు ఎక్కడం, దిగడం, పడవ ప్రయాణం, గుర్రపు స్వారీ, విలు విద్య, ఆస్ట్రేలియన్ నడకలో శిక్షణ పొందారు. రోజంతా సాహస క్రీడల శిక్షణ కొనసాగింది.
ఆత్మవిశ్వాసం నింపేందుకు
పిల్లల్లో భయం తొలగించి వారిని అన్ని రంగాల్లో ముందుకు వచ్చేలా ఈ సాహస క్రీడలు దోహద పడతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు జగదీశ్వర్ రావు, శ్రీరామ్ సోనీ, శ్రీనివాస్‌రావు, రాజేశ్వర్, డా.విశాల్, దర్శన్ సింగ్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలి తీసుకున్న ప్రమాదం