నిజామాబాద్ జిల్లా బాల్కొండలో గ్రామ దేవతలను పవిత్ర గోదావరి నదీ జలాలతో జలాభిషేకం నిర్వహించారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో దేవతల అమావాస్య కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని.. పంటలు బాగా పండాలని కోరుతూ ఈ ఉత్సవాన్ని చేశారు.
గోదావరి జలాలతో ఘనంగా గ్రామ దేవతల జలాభిషేకం - abhishekam to goddess in balconda by people
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో దేవతల అమావాస్యను పురస్కరించుకుని గ్రామస్థులు గ్రామదేవతలందరికీ గోదావరి నదీ జలాలతో జలాభిషేకం నిర్వహించారు.
గోదావరి జలాలతో ఘనంగా గ్రామ దేవతల జలాభిషేకం
గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని గోదావరి నది నుంచి బిందెల్లో గంగా జలాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. డప్పు వాయిద్యాలతో గంగా జలాలను ఊరేగించి దేవతలందరినీ అభిషేకించారు.
ఇదీ చూడండి : పురపాలికలను దక్కించుకునేందుకు తెరాస వ్యూహాలు