BRS Leader Raped A 13 Year Old Girl In Nizamabad : ఒకవైపు చూస్తే పేదరికం.. మరోవైపు చూస్తే తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. తల్లి అనారోగ్యంతో మంచాన పడింది. ఇంకోపక్క అన్నదమ్ములు కాని అక్కచెల్లెళ్లుగానీ ఎవరూ లేరు. ఈ పరిస్థితుల్లోనే చదువుకుంటూ 13 సంవత్సరాల బాలిక.. తల్లికి తోడుగా ఉంటూ అన్నీతానై తల్లికి సహాయంగా ఉంటుంది. అలా సాగిపోతున్న చిన్నారి ప్రయాణంలోకి అనుకోని అపాయం ఎదురైంది. అధికార పార్టీకి చెందిన నేత చేతికి చిక్కి.. అతి క్రూరంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఓ కాలనీలో చోటుచేసుకుంది. కానీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తును ప్రారంభించారు. అలాగే బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే షకీల్ పరామర్శించి.. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Minor Girl Was Raped In Nizamabad : ఈ సందర్భంగా ఎమ్మెల్యే అత్యాచారానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. 13 సంవత్సరాల బాలికను కాలు, చేతులు కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కి అతి కిరాతకంగా అత్యాచారం చేశారని ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని లా ప్రకారం ఉరితీయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అధికార పార్టీకి చెందిన నేత కొత్తపల్లి రవీందర్, అతనికి సహకరించిన నిందితుడి అన్న రాధాకృష్ణను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వివరించారు.