నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని పాలానాధికారి ముషారఫ్ ఫారుఖీ అన్నారు. బుధవారం నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డుపై వెళ్తున్న ప్రజలకు వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. దాదాపు 200 మందికి థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేయగా... అందులో ఏ ఒక్కరికీ కొవిడ్ లక్షణాలు లేవని కలెక్టర్ తెలిపారు.
రోడ్డుపై వెళ్తున్న వారికి థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్‌లు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద రోడ్డుపై వెళ్తున్న వారికి థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. దాదాపు 200 మందికి ఈ పరీక్షలు చేసినట్లు... అందులో ఏ ఒక్కరికీ కరోనా లక్షణాలు లేనట్లు కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ తెలిపారు.
జిల్లాలో మొత్తం 20 మందికి కరోనా వైరస్ లక్షణాలను గుర్తించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి పంపించగా... అందులో నుంచి 12 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జీ అయినట్లు పేర్కొన్నారు. మరో ఎనిమిది మంది కూడా త్వరలోనే కోలుకోవాలని ఆశిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. అత్యవసరమైన కార్యకలాపాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కొన్ని సడలింపులు చేశామని అన్నారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకూ ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రాకూడదని కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ సూచించారు.
ఇవీ చూడండి:సాదాసీదాగా తెజస వార్షికోత్సవం