లాక్డౌన్ వేళ పేదలకు తోచినంతలో చేస్తున్న దాతల సాయం వెలకట్టలేనిదని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. నిర్మల్‌లో ఎస్బీఐ బ్యాంక్ ఉద్యోగుల సౌజన్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బంగల్పేట్ మహాలక్ష్మి కాలనీవాసులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
'లాక్డౌన్ వేళ దాతల ప్రోత్సాహం వెలకట్టలేనిది' - corona update
నిర్మల్‌లో ఎస్బీఐ బ్యాంక్ ఉద్యోగుల సౌజన్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బంగల్పేట్ మహాలక్ష్మి కాలనీవాసులకు ఎస్పీ శశిధర్‌రాజు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా ఇంటి వద్దనే ఉండి ప్రభుత్వ సూచనలు పాటించాలని ఎస్పీ కోరారు.
'లాక్డౌన్ వేళ దాతల ప్రోత్సాహం వెలకట్టలేనిది'
లాక్డౌన్ సమయంలో వలస కూలీలు, నిరుపేదలకు సాయం చేసేందుకు మానవతా మూర్తులు ముందుకొచ్చి నిత్యావసర సరుకులు సమకూర్చడం అభినందనీయమన్నారు. ప్రజలకు కరోనా నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలనే అంశాలను వివరించారు. మాస్కులు ధరించుట, వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా ఇంటి వద్దనే ఉండి ప్రభుత్వ సూచనలు పాటించాలని ఎస్పీ కోరారు.