తెలంగాణ

telangana

ETV Bharat / state

షాదీ ముబారక్​, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - telangana government

నిర్మల్​ జిల్లా ముధోల్​ ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే విఠల్​రెడ్డి షాదీ ముబారక్​, కల్యాణిలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రైతుల సంక్షేమ కొరకు రాష్ట్ర సర్కారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను విరివిగా ప్రారంభిస్తోందని ఎమ్మెల్యే అన్నారు.

mla vittalreddy cheques distribution in nirmal district
షాదీ ముబారక్​, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

By

Published : Apr 30, 2020, 7:52 PM IST

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు అండగా నిలిచిందని శాసనసభ్యులు విఠల్​రెడ్డి అన్నారు రైతుల సంక్షేమం కొరకు సర్కారు కట్టుబడి ఉందని... ప్రభుత్వపరంగా కొనుగోలు కేంద్రాలను విరివిగా ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వలస కూలీల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాకపోకలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఈ సదుపాయాన్ని వలస కూలీలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details