కరోనా వైరస్ బాధితులు, పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు దాతలు వీరోచితంగా సాయం చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్‌లో విజయ డైరీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు, పోలీసులు, వైద్య సిబ్బందికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
'పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలి' - LOCK DOWN EFFECTS
నిర్మల్‌లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, పోలీసులు, జర్నలిస్టులకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మజ్జిగ ప్యాకెట్లు పంచారు. పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
'పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలి'
కరోనా వైరస్ బాధితులు, ఆర్థికంగా చితికిపోయిన వారికి దాతలు ముందుకు వచ్చి సాయం అందించాలని కోరారు. నిర్మల్ జిల్లాను రెడ్‌జోన్‌గా ప్రకటించినందున ప్రజలంతా ఇళ్లలోనే ఉండి సహకరించాలని కోరారు. జిల్లాలో లాక్‌డౌన్‌ను పోలీసుశాఖ పగడ్బందీగా అమలు చేస్తోందన్నారు.
నిత్యవసర వస్తువుల కోసం ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు వాహనాల ద్వారా పదివేల ప్యాకెట్లను వాహనాల ద్వారా అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.