కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకమని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. నిర్మల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని మజ్లిస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకిస్తుందన్నారు. ఈ చట్టం ఒక ముస్లింలకే కాదు ప్రజలందరికీ ఇబ్బందులను తెచ్చిపెడుతుందని తెలిపారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెరాసకి ఎంఐఎం మద్దతు తెలిపిందని గుర్తుచేశారు.