మహారాష్ట్ర- నిర్మల్ సరిహద్దు అయిన తానూర్ మండలం బెల్ తారోడ చెక్‌పోస్టు వద్ద గుజరాత్‌లోని గిరి సోమనాథ్ నుంచి 60 బస్సులలో 4500 మంది వలస కూలీలు స్వస్థలాలకు బయల్దేరారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మీదుగా వారు సొంతూళ్లకు చేరుకోనున్నారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా సరిహద్దులో డీఎస్పీ, రెవిన్యూ అధికారులు తనిఖీలు చేసి తెలంగాణ మీదుగా ప్రయాణించేందుకు అనుమతులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వలస కూలీలను స్వస్థలాలకు పంపడానికి గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్న వలస కార్మికుల బస్సులను తనిఖీలు చేసి తెలంగాణలోకి అనుమతించామని డీఎస్పీ నర్సింగ్ రావు తెలిపారు.
స్వస్థలాలకు చేరుకోనున్న 4500 మంది వలస కార్మికులు
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు స్వస్థలాలకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 60 బస్సుల్లో బయల్దేరిన 4500 మంది వలస కూలీలు తెలంగాణ మీదుగా సొంతూళ్లకు చేరుకోనున్నారు.
స్వస్థలాలకు చేరుకోనున్న 4500 మంది వలస కార్మికులు