నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బట్టిగల్లీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 85 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో 100 మందికి పైగా పోలీస్ సిబ్బంది ఇంటింటా సోదాలు నిర్వహించారు. ప్రజల్లో మమేకమై ప్రజాసమస్యలు తీర్చేందుకే పట్టణలు, గ్రామాల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు.
భైంసాలో పోలీసుల నిర్బంధ తనిఖీలు - భైంసాలో పోలీసుల నిర్బంధ తనిఖీలు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బట్టిగల్లీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 85 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

భైంసాలో పోలీసుల నిర్బంధ తనిఖీలు
సోదాలు చేసే విషయంలో ప్రజలు భయాందోనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలన్నారు.
భైంసాలో పోలీసుల నిర్బంధ తనిఖీలు
ఇవీ చూడండి: కేసీఆర్ వెంట మంత్రి ఈటల కుటుంబం...