తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎడతెరిపి లేని వర్షం.. ఆందోళనలో 'శనగ' రైతులు - ముథోల్‌లో ఎడతెరిపి లేని వానలు

నిర్మల్‌ జిల్లా ముథోల్‌ నియోజకవర్గంలో గురువారం అర్ధరాత్రి నుంచి కురిసిన వానకు శనగ, పత్తి, జొన్నపంటలు నేలరాలాయి. సెప్టెంబరులో కురిసిన అకాల వర్షాలతో మొదటి పంట వరదల్లో మునిగితే.. రెండో పంటపైన ఆశ పెట్టుకున్న రైతులకు ఈసారి కూడా నిరాశే మిగిలేలా ఉంది.

rain in muthol constituency
ముథోల్‌ నియోజక వర్గం, నేల రాలిన పంటలు

By

Published : Feb 19, 2021, 1:00 PM IST

నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈ వర్షానికి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చేతికి వచ్చిన శనగ పంట, పత్తి పంట, మరి కొద్ది రోజుల్లో వచ్చే జొన్నపంటలు వానకు నేలరాలాయి.

అధిక వర్షాలతో మొదటి పంటలో అనుకున్నంత దిగుబడి రాకపోవడంతో రెండో పంటపై రైతన్నలు ఆశలు పెట్టుకున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో అనుకోకుండా కురిసిన వాన.. వారిని ఆందోళనలకు గురిచేస్తోంది. దాదాపు 40 శాతం వరకు శనగ పంట దెబ్బతిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:బంజారాహిల్స్​లో చీపురు పట్టిన ట్రాఫిక్ పోలీసులు

ABOUT THE AUTHOR

...view details