'ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి' - covid hopital in nirmal
నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సందర్శించారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలను పరిశీలించారు. కొవిడ్ కట్టడికి ప్రతిపక్షాల సూచనలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.
clp leader batti vikramarka visited in nirmal hospital
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రిని భట్టి సందర్శించారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలను పరిశీలించారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉంటే రోగులకు సేవలు ఎలా అందిస్తారని భట్టి నిలదీశారు. కొవిడ్ కట్టడికి ప్రతిపక్షాల సూచనలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. కొవిడ్ చికిత్సపై ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు.