నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని బ్రహ్మన్గావ్ గ్రామ శివారంలో గురువారం విద్యుత్తు తీగలు తగిలి ఏడు పశువులు మృతి చెందాయి. రెండు రోజుల క్రితం గాలీ బీభత్సంతో పంట పొలంలోని విద్యుత్ స్తంభానికి ఉన్న సపోర్ట్ తీగ తెగిపోయింది. తీగ తెగిపోవడంతో విద్యుత్తు స్తంభం ఓకే వైపునకు వంగి విద్యుత్తు తీగలు కిందకి వచ్చాయి.
విద్యుత్ తీగలు తగిలి పశువుల మృతి
విద్యుత్ తీగలు తగిలి పశువులు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. గాలి బీభత్సానికి పొలంలోని స్తంభం ఒకవైపు వంగడంతో ఈ ప్రమాదం జరిగింది.
మేతకు వెళ్లిన పశువులు కిందకి ఉన్న తీగలు తగలడంతో విద్యుఘాతానికి గురై ఏడు పశువులు మృతి చెందాయి. పశువుల కాపరి అప్రమత్తంగా వ్యవహరించి మిగతా పశువులను విద్యుత్ తీగల వైపు రాకుండా జాగ్రత్త పడటంతో ప్రమాదం నుంచి బయటపడ్డాయి. పాడి పశువులు మృతి చెందడంతో ఉపాధి కోల్పోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను అడిగితెలుసుకున్నారు.
ఇదీ చూడండి: child trafficking: పిల్లల దత్తత పేరుతో దర్జాగా మోసాలు!