గణేశ్ నిమజ్జనోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు - గణేశ్ నిమజ్జనోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇవాళ జరగనున్న వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గణేశ్ నిమజ్జనోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు
గణేష్ నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్మల్ జిల్లా భైంసా పట్టణ పోలీసులు చర్యలు తీసుకున్నారు. శోభాయాత్రలో వందకుపైగా విగ్రహాలు పాల్గొననున్నాయని ఎస్పీ శశిధర్‌రాజు తెలిపారు. విధులు చేపడుతూనే భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసులకు సూచించారు. పలు చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తోందన్నారు.