ఉపాధి కోసం వెళ్లారు.. కరోనాతో సరిహద్దులోనే చిక్కుకున్నారు - Telangana Labours Strucked in Bombay due to carona effect
కూలిపని కోసం ముంబై వెళ్లిన సుమారు 600 మంది తెలంగాణకు చెందిన కూలీలు కర్ణాటక సరిహద్దు వద్ద చిక్కుకుపోయారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా వీరంతా స్వగ్రామలకు బయలుదేరగా... సరిహద్దు వద్ద అధికారులు అడ్డుకున్నారు.
Telangana Labours Strucked in Mumbai due to carona effect
నారాయణ పేట, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన కూలీలు రెండునెలల క్రితం కూలి పని కోసం ముంబై వెళ్లారు. కరోనా ప్రభావంతో పనులు లేక మూడురోజుల క్రితం అక్కడి నుంచి సొంత గ్రామాలకు పయనమయ్యారు. కర్ణాటక బోర్డర్ వద్ద వారిని అధికారులు నిలిపివేశారు. వారందరినీ తిరిగి షోలాపూర్ సమీపంలో వదిలేశారు. మహారాష్ట్ర పోలీసులు వారికి భోజన వసతి కల్పించారు. తమని స్వగ్రామాలకు చేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నారు.