నారాయణపేట జిల్లా నుంచి దిల్లీలోని మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి గ్రామాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ హరిచందన ఆదేశం మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మరికల్ మండలంలోని అశోక్‌నగర్ కాలనీలో డ్రోన్ సాయంతో రసాయనిక ద్రావణాన్ని పిచికారీ చేశారు. నర్వ మండలంలోని రాంపూర్‌లో కూడా డ్రోన్ల సాయంతో రసాయనాలు పిచికారీ చేయించారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
డ్రోన్ల సాయంతో రసాయనాల పిచికారీ - corona precautions
మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి గ్రామాల్లో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా డ్రోన్ల సాయంతో రసాయనాలు పిచికారీ చేయిస్తున్నారు.
డ్రోన్ల సాయంతో రసాయనాల పిచికారీ