తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్ సభను రద్దు చేయండి: యుగతులసి ఫౌండేషన్ - సభను అడ్డుకోవాలని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్​ను వినతిపత్రం

సాగర్​ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన బహిరంగ సభను రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి యుగతులసి ఫౌండేషన్ విజ్ఞప్తి చేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా నల్గొండ జిల్లా అనుములలో జరగనున్న సభను అడ్డుకోవాలని హైదరాబాద్​ బుద్ధభవన్​లోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్​ గోయల్​ను కలిసి వినతిపత్రం సమర్పించింది.

yuga thulasi foundation complaint to state electoral officer
చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్​ను కలిసి ఫిర్యాదు యుగతులసి ఫౌండేషన్

By

Published : Apr 12, 2021, 8:27 PM IST

ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నల్గొండ జిల్లా అనుములలో ఈనెల 14న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను రద్దు చేయాలని యుగ తులసి ఫౌండేషన్ ప్రతినిధులు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇప్పటికే దీనిపై ఇద్దరు స్థానిక రైతులు హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా యుగతులసి ఫౌండేషన్​ ప్రతినిధులు బుద్ధ భవన్​లోని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్​ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

కరోనా వేగంగా విస్తరిస్తున్న సమయంలో సీఎం బహిరంగ సభకు అనుమతి ఇవ్వొద్దని సీఈవోను కోరినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. సభ నిర్వహించినట్లైతే హాజరైన వారి తరఫున కేసీఆర్​తో చలాన్ కట్టించాలని డిమాండ్ చేశారు. వైఎస్​ షర్మిల ఖమ్మం సభకు అనుమతి ఇచ్చారని... గో మహాగర్జనకు ఇచ్చిన అనుమతినే రద్దు చేశారని వారు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: సీఎం ఎన్నికల ప్రచార సభ ఆపాలని రైతుల పిటిషన్‌

ABOUT THE AUTHOR

...view details